కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని నాంపల్లి లో ఉన్న ప్రజాప్రతినిధుల ప్రత్యేక మనోరంజన్ కోర్టుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) హాజరయ్యారు. 2022 జనవరి 4న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిఆర్ బస్తీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రెస్ మీట్ నిర్వహించారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది.
అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో భట్టి విక్రమార్కతో పాటు మరో ఆరుగురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క న్యాయమూర్తి ముందు వ్యక్తిగతంగా హాజరయ్యారు.

