1300 మంది పోలీసులతో బందోబస్తు: సీపీ సాయి చైతన్య

కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్లలో గణేష్ నిమజ్జన శోభయాత్రల సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) వెల్లడించారు. శోభాయాత్ర, నిమజ్జన ప్రక్రియ శాంతియుతంగా నిర్వహించేదుకు దాదాపు 1300 మందికి పైగా పోలీస్ సిబ్బందిని నియమించామని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా డ్రోన్ కెమెరాలలతో పర్యవేక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీస్ సిబ్బందితో పాటు ఎక్సైజ్, ఫారెస్ట్ మొదలైన వారితో బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు. ప్రజలు శాంతియుతంగా నిమజ్జన వేడుకల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>