కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచినందుకు గతంలోనే ఆమె రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా పంపారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించినా నేటి వరకు ఫైనల్ కాలేదు. ఈ నేపథ్యంలో కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు శాసన మండలిలో గుత్తాను కలవనున్నారు. తన రాజీనామాను (Resign) ఆమోదించాలని కవిత మరోసారి కోరనున్నట్లు తెలుస్తోంది. మండలి చైర్మన్ గుత్తా కవిత రాజీనామాను ఆమోదిస్తారా? లేదా? అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
Read Also: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఖతమే: కవిత
Follow Us On: Instagram


