కలం, జడ్చర్ల: సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల కల సాకారం దిశగా మరో అడుగు పడింది. రాజాపూర్ మండలంలోని 10 గ్రామాలకు చెందిన 30 మంది ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి (Janampalli Anirudh Reddy) మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు గౌరవప్రదమైన జీవనం అందించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.

