బీజేపీ ఆందోళనతోనే జూరాల నీటి విడుదల: కేతూరి బుడ్డన్న

కలం, వనపర్తి: జూరాల ప్రాజెక్ట్  ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యపై బీజేపీ నిరంతరం పోరాడుతోందని ఆ పార్టీ  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కేతూరి బుడ్డన్న స్పష్టం చేశారు. జూరాల వద్ద నిర్వహించిన ఆందోళనతో పాటు రైతుల తరఫున కొనసాగించిన పోరాటం ఫలితంగానే ప్రభుత్వం సాగునీటి కోసం నీటిని విడుదల చేసిందని పేర్కొన్నారు.

దీంతో రైతుల పక్షాన పోరాడిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. పంటలకు అవసరమైన సమయంలో సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. రైతులకు ఏ సమస్య వచ్చినా బీజేపీ అండగా నిలిచి, వారి హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తుందని బుడ్డన్న స్పష్టం చేశారు.

జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళనలో పాల్గొన్నారు. సాగునీటి కోసం చేపట్టిన ఆందోళన సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి తరలించారు. అయినప్పటికీ రైతుల సమస్య పరిష్కారం కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>