కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలోని (Adilabad RIMS) నవజాత శిశువుల వార్డులో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) మంగళవారం ఆస్పత్రిని సందర్శించారు. ప్రమాదం అనంతరం చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు.
నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, అనంతరం చేపట్టిన చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, రిమ్స్ (Adilabad RIMS) డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ తదితరులు ఉన్నారు.
Also Read : నిమ్స్ డాక్టర్ ఇంట్లో సోదాలు.. భారీగా అక్రమాస్తులు
Follow Us On: X(Twitter)

