ఎంజీఎం ప‌ర్య‌ట‌న‌ ఉద్రిక్తం.. విన‌య్‌ భాస్క‌ర్‌కు గాయాలు

క‌లం, వెబ్‌డెస్క్‌: వ‌రంగ‌ల్‌లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్ (Dasyam Vinaya Bhaskar) ఎంజీఎం సందర్శన ఉద్రిక్తంగా మారింది. ఎంజీఎం ఆసుపత్రిలో పెచ్చులు ఊడి గాయపడిన రోగులను పరామర్శించేందుకు వెళ్లిన వినయ్ భాస్కర్‌ను ఆసుపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో వినయ్ భాస్కర్‌కు గాయాలై కాలు, చేతి నుంచి రక్తస్రావం అయింది. పోలీసులను దాటుకొని ఆసుపత్రికి వెళ్లిన ఆయన, పేద ప్రజలకు కనీస వైద్యం అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రోగులకు సరిపడా బెడ్లు లేకపోవడం, భవనం పెచ్చులూడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. బీఆర్ఎస్ శ్రేణుల‌తో క‌లిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన అని చెప్పుకుంటూ కాంగ్రెస్ స‌ర్కార్‌ ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసింద‌ని మండిపడ్డారు. ఎంజీఎంను సందర్శించకుండా అడ్డుకోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తోపులాటలో తన చేయి విరిగిందని, పోలీసులు కడుపులో తన్నారంటూ కంటతడి పెట్టుకున్నారు. మూడేళ్లుగా ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గాలికొదిలేశారని, ప్రతిపక్ష నేతలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>