మానసిక వికలాంగులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి : డాక్టర్ రవితేజ

కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ మారుతి నగర్‌లోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ (Sneha Society for Rural Reconstruction) నిర్వహించే మానసిక దివ్యాంగుల పాఠశాల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఇన్నమూరి రవితేజ ముఖ్య అతిథిగా హాజరై తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానసిక దివ్యాంగులు తల్లిదండ్రులకు దేవుడిచ్చిన ప్రసాదమని వారిని జాగ్రత్తగా పెంచి, ఉపయోగకర పౌరులుగా తీర్చి దిద్దాలని సూచించారు.

వారికి తల్లిదండ్రులు ఎక్కువ సమయం ఇచ్చి వారి మనస్తత్వాన్ని బట్టి మలచుకోవాలనీ అన్నారు. మానసిక వికలాంగులలో (Intellectual Disabilities Children) ఉండే ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేయవలసిన లోకల్ ప్రాజెక్ట్ కమిటీ యొక్క ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికలలో మానసిక దివ్యాంగుల పిల్లల తల్లిదండ్రులు నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు పని చేస్తుందని తెలిపారు.

పాత కమిటీలో బాబా గౌడ్ చైర్మన్‌గా, జగదంబరావు వైస్ చైర్మన్‌గా, ఎన్‌. లక్ష్మి టీచర్ కన్వీనర్‌గా, పేరెంట్స్ సూర్య ప్రకాష్, ఆస్మాలు కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరి పదవీకాలం ముగియడంతో నూతన కమిటీ సభ్యులుగా బ్రహ్మానంద రెడ్డి చైర్మన్‌గా , రామ్ సుజన్ వైస్ చైర్మన్‌గా, ఇంద్రాణి టీచర్ కన్వీనర్‌గా, పేరెంట్స్ భాగ్యలక్ష్మి, బ్రహ్మయ్యలు కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. జ్యోతి, మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, మానసిక దివ్యాంగుల తల్లిదండ్రులు, దివ్యాంగులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>