వైద్య విద్యార్థినికి పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆర్థిక సహాయం

కలం, ​కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన నిరుపేద పద్మశాలి చేనేత కుటుంబానికి చెందిన కుమారి గుండ అనూశ్రీ వైద్య విద్యాభ్యాసానికి తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం అండగా నిలిచింది. గుండ శ్రీహరి కుమార్తె అయిన అనూశ్రీ నీట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబరిచి సిద్దిపేట జిల్లాలోని సురభి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ సీటు సాధించారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండటంతో కళాశాల ఫీజులు, హాస్టల్ ఖర్చులు భరించలేని స్థితిలో ఆమె సీటు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.

​ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చిందం శ్రీనివాస్ వెంటనే స్పందించారు. సంఘం సభ్యుల సహకారంతో విరాళాలు సేకరించి నిరుపేద విద్యార్థిని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూ. 50,016 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం అధ్యక్షులు చిందం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంగ రవీందర్, ఉపాధ్యక్షులు మిట్టపల్లి రాజేంద్ర ప్రసాద్, దూస రాజశేఖర్, కోశాధికారి మంచికట్ల రవి, ఆర్గనైజింగ్ కార్యదర్శి గూడెల్లి లక్ష్మినర్సయ్య, సంయుక్త కార్యదర్శి గట్టు రమేష్, కార్యాలయ కార్యదర్శి దిడ్డి ప్రదీప్, అలువాల భీమేశ్వర్ తదితర కార్యవర్గ సభ్యులు పాల్గొని విద్యార్థినికి ఆర్థిక సహాయం అందజేసి అభినందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>