చేతకానితనాన్ని ఎల్‌నినో మీద పెడుతున్న రేవంత్.. హరీశ్ రావు ఫైర్

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేతకానితనాన్ని ఎల్‌నినో మీద పెడుతున్నారని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం నీళ్లు బేసిన్‌కు సంబంధం లేని కుప్పం నియోజకవర్గానికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. ఏపీలో రైతుల కేరింతలు కొడుతుంటే.. తెలంగాణలో రైతుల ఆక్రందనలు మాత్రమే వినిపిస్తున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి చేతగాని పాలన వల్లే రైతాంగం కష్టాలు పడుతున్నారని మండిపడ్డారు.

రేవంత్ స్వంత జిల్లాల్లోనూ నీళ్లు ఇవ్వలేదు..

శ్రీశైలం (Srisailam) నుంచి 700 కిలోమీటర్లు కృష్ణా నదీ జలాలను చంద్రబాబు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. బేసిన్ కాని బేసిన్‌కు చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తున్నారని దుయ్యబట్టారు. ఇంత జరుగుతున్నా  రేవంత్ రెడ్డి మాత్రం బేసిన్‌లోనే ఉన్న ప్రాజెక్టులకు సాగునీళ్లు తీసుకెళ్లడం లేదన్నారు. కనీసం సీఎం రేవంత్ రెడ్డి స్వంత జిల్లా పంటలకు కూడా నీళ్లు ఇవ్వలేక ఎండబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పొంగులేటికి కౌంటర్..

గులాబీ చొక్కాలకు ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నామన్న పొంగులేటి వ్యాఖ్యలకు హరీశ్ రావు (Harish Rao) కౌంటర్ ఇచ్చారు. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి సీతక్క తల్లిదండ్రులకు పోడు పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తే మంత్రులు కర్ణాటక వెళ్తున్నారని అన్నారు. రైతుల పంటలు ఎండబెట్టి ఉసురుబోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ నిర్వహణలో ఫెయిల్..

అటు విద్యుత్ వ్యవస్థ నిర్వహణలోనూ రేవంత్ సర్కార్ ఫెయిల్ అయిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. యాదాద్రి పవర్ ప్లాంట్ పూర్తి సామర్ధ్యం 4 వేల మెగావాట్లకు 400 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. ఆనాడు కేసీఆర్ విజన్‌తో దేశంలో ఎక్కడాలేని విధంగా యాదాద్రి అల్ట్రా మెగా ధర్మల్ పవర్ ప్లాంట్‌ను నిర్మించారని గుర్తు చేశారు. యాదాద్రి ప్లాంట్ కి జీ10, జీ11 క్వాలిటీ కోల్ ఇవ్వాలని.. కానీ జీ13, జీ14 క్వాలిటీ కోల్ వాడుతున్నారని విమర్శించారు.

పర్యటిస్తే అడ్డుకుంటారా?

సింగరేణి (Singareni) బొగ్గు వాడకంలో నాణ్యతా లోపం ఉందని హరీశ్ రావు మండిపడ్డారు. కొత్తగూడెంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి, భద్రాద్రిలో 540 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆగిందని చెప్పారు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉంటే ఈ రోజు బొగ్గు కొరత ఎందుకు ఏర్పడుతుంది? అని ప్రశ్నించారు. దీనిని ప్రశ్నించేందుకు తాను క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళితే పోలీసులు అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా 1600 మెగావాట్ల విద్యుత్ ఎన్టీపీసీ ద్వారా ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు.

రైతాంగానికి 7 నుంచి 8 గంటలే..

తెలంగాణలో తయారయ్యే సింగరేణి ఉత్పత్తి విద్యుత్ వద్దని రాజస్తాన్ ప్రభుత్వంతో  రేవంత్ సర్కార్ పీపీఏ కుదుర్చుకుందన్నారు.  రాజస్థాన్‌కు కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అని నిలదీశారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన విద్యుత్ ఉత్పత్తిలో మూడవ వంతు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. రైతాంగానికి 7 నుంచి 8 గంటలు కరెంటు కూడా ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.

Also Read : బ్లడ్ బ్యాంకుపై ఆరోపణలు.. చిరంజీవి సీరియస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>