కలం, కరీంనగర్: కేంద్ర ప్రభుత్వ పిలుపుమేరకు మంగళవారం శంకరపట్నం మండలం గద్దపాక (Gaddapaka) గ్రామంలో ‘స్వచ్ఛ సేవా’ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల సంయుక్త ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా కొనసాగింది. పరిశుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రాంగణంలో వివిధ రకాల మొక్కలను నాటారు. పచ్చదనం-పరిశుభ్రత ప్రాముఖ్యతను విద్యార్థులకు, గ్రామస్తులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ (Gaddapaka) సర్పంచ్ కొయ్యడ పరుశరాములు యాదవ్, గ్రామ ఉపసర్పంచ్ జంగా జైపాల్ యాదవ్, వార్డు సభ్యులు పలకల శంకర్, రెడ్డి, ఐరేని ప్రణయ్, బాకారపు వేణు, పున్నం ఐలయ్య, పంచాయతీ కార్యదర్శి తిరుపతి, జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, అంగన్వాడీ టీచర్ కరుణ, పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని కార్యక్రమ ముఖ్య అతిథులు పిలుపునిచ్చారు.
Also Read : యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక ప్రకటన
Follow Us On: X(Twitter)

