జ‌నాభా దామాషా ప్ర‌కార‌మే బ‌డ్జెట్ కేటాయింపులు: సీఎం రేవంత్ రెడ్డి

క‌లం, వెబ్‌డెస్క్‌: రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకార‌మే బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్ప‌ష్టం చేశారు. స‌చివాల‌యంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై నిర్వ‌హించిన స‌మీక్ష‌లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుంద‌న్నారు. ఆయా వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేర‌ని చెప్పారు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్‌ పట్టాలు అందించిన ఘనత ఇందిరా గాంధీకే ద‌క్కుతుంద‌న్నారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పని చేస్తుంద‌ని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లల్లో 31 శాతం లబ్ధిదారులు దళితులే ఉన్నార‌ని సీఎం తెలిపారు. ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన‌ట్లు వెల్ల‌డించారు.

రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి సన్న బియ్యం అందిస్తున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స‌న్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నామ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం దళితులు, గిరిజనులు,ఆదివాసీలను దృష్టిలో ఉంచుకునే సంక్షేమ పథకాలను అమలు చేస్తోంద‌ని వెల్ల‌డించారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు, మ‌హిళ‌ల ర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం అన్నారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోంద‌ని తెలిపారు. బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్‌తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్‌లో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇక ప్ర‌భుత్వం విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు తీసుకురాబోతుంద‌ని సీఎం తెలిపారు. చదువొక్కటే పేద‌ల‌ జీవితాలను మారుస్తుంద‌ని అన్నారు. అట్టడుగు వర్గాలను చదువు వైపు నడిపించకపోతే ఏ సమస్యలు పరిష్కారం కావ‌న్నారు. పిల్లల్ని చదువు వైపు, క్రీడలవైపు ప్రోత్సహించాల‌ని ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల‌కు సూచించారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామ‌ని సీఎం వెల్ల‌డించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>