బెంగాల్‌లో విచిత్రం.. రైలును ఆపి మరీ పూజలు!

కలం, వెబ్ డెస్క్ : పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో విశ్వకర్మ పూజ వేడుకల సందర్భంగా విచిత్ర ఘటన చోటుచేసుకుంది. నడుస్తున్న లోకల్ రైలును గ్రామస్థులు పట్టాలపై నిలబడి ఆపి, ఆ రైలు ఇంజన్‌కు పూజలు నిర్వహించారు.

సీల్దా వైపు వెళ్తున్న ఒక లోకల్ రైలును కొందరు వ్యక్తులు ట్రాక్‌పై నిలబడి ఆపారు. అనంతరం రైలు ఇంజన్‌పై ఎక్కి అరటి ఆకులు, ఎర్రటి గుడ్డలతో అలంకరించి విశ్వకర్మ పూజ చేశారు. ఈ సమయంలో మేళతాళాలు వాయిస్తూ, పిండివంటలు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. విశ్వాసాలు ఉండవచ్చు కానీ, ఇలా వేగంగా వచ్చే రైళ్లను పట్టాలపై నిలబడి ఆపడం ప్రమాదకరమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే భద్రతా నిబంధనలను ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Also Read : దసరాకొకటి.. సంక్రాంతికి మరొకటి.. డీఏలపై ప్రభుత్వం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>