మలేషియా వెళ్లే భారతీయులకు కీలక హెచ్చరిక

కలం, వెబ్ డెస్క్ : మలేషియాకు పర్యాటక (Malaysia Travel) వీసాపై వెళ్లే భారతీయులకు కౌలాలంపూర్ లోని భారత హైకమిషన్ అత్యవసర సూచనలు జారీ చేసింది. 30 రోజుల ఉచిత వీసా వెసులుబాటును ఉపయోగించుకుని ఉద్యోగాల వేట కోసం వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. నకిలీ ఏజెంట్ల మోసపూరిత ఉద్యోగ ప్రకటనలు నమ్మి పర్యాటక వీసాలపై వచ్చి ఉద్యోగాలు చేయడం ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

దీనివల్ల అక్రమంగా ఉండడం, చట్టపరమైన చర్యలు ఎదుర్కోవడం, డిటెన్షన్ లో పెట్టడం వంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. పర్యాటక వీసా కేవలం విహారయాత్రలు, సామాజిక సందర్శనలకు మాత్రమే పరిమితమని తెలిపింది. అసలైన టూరిస్టులు మలేషియా చేరుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్, రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వివరాలు కలిగి ఉండాలని సూచించింది. అలాగే ప్రయాణానికి 3 రోజుల ముందు ‘మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్’ (MDAC) ను ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా సమర్పించాలని తెలిపింది. సరైన వర్క్ పర్మిట్, వీసా విత్ రెఫరెన్స్ (VDR) లేకుండా ఉద్యోగం కోసం మలేషియాకు ప్రయాణించవద్దని (Malaysia Travel) హైకమిషన్ విజ్ఞప్తి చేసింది.

Also Read : నదిలో కొట్టుకుపోయిన ఏనుగు పిల్లను కాపాడిన మత్స్యకారులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>