ముధోల్‌లో బీజేపీ బలోపేతానికి సమిష్టిగా కృషిచేయాలి: ఎమ్మెల్యే పటేల్

కలం, భైంసా: ముధోల్ (Mudhole) నియోజకవర్గంలో బీజేపీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patel) అన్నారు. బీజేపీ వివిధ మోర్చాలకు జిల్లా స్థాయి పదవులు పొందిన నాయకులను మంగళవారం భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అన్నారు. పార్టీకి కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంస్థాగతంగా బలోపేతం చేయాలని సూచించారు.

Also Read : మలేషియా వెళ్లే భారతీయులకు కీలక హెచ్చరిక

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>