కలం, అచ్చంపేట: అమ్రాబాద్ (Amrabad) టైగర్ రిజర్వ్ జోన్లో స్వీపర్‌గా పని చేస్తున్న చెంచు మహిళ అడవిలోకి వెళ్లి మరణించిన ఘటన సోమవారం వెలుగు చూసింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కాట్రాజు ఈదమ్మ( 45) ఫరహాబాద్ గేటు వద్ద స్వీపర్‌గా పని చేస్తున్నారు. ఆరు నెలల నుంచి జీతాలు సకాలంలో రాకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారింది.
దీంతో, అడవిలోకి విస్తరాకులు (మార్పటాకులు) తెచ్చి అమ్ముకోవడానికి ఈదమ్మ మల్లాపూర్‌లోని మక్కలేటి ఇరుపుల వాగు సమీపంలోకి వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తూ ఎత్తయిన ప్రాంతం నుంచి కింద పడిపోయినట్లు ఆమెతో వెళ్లినవారు తెలిపారు. గతంలో ఆమె భర్త ఫారెస్ట్ వాచర్‌గా పనిచేశారు. ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు, ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కోరుతున్నారు.

