రైతుల సంక్షేమమే తొలి ప్రాధాన్యత: సంజీవ్ ముదిరాజ్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యత అని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టు నీటి విడుదల అంశాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. రైతులకు సాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యతేనని, అదే సమయంలో ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడకుండా ముందస్తు ప్రణాళికతో నీటి వనరులను వినియోగించాల్సిన అవసరం ఉందన్నారు.

జూరాల ప్రాజెక్టు(Jurala Project)కు వచ్చే నీటి ప్రవాహాలు తగ్గిన సందర్భాల్లో తాగునీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని నీటి నిర్వహణ చేయాల్సి ఉంటుందని సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. జూరాలలో నీరు ఉన్నప్పుడు రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వానికి ఎలాంటి సంకోచం లేదన్నారు. కృష్ణా బేసిన్‌లో వర్షపాతం, పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహాలు అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

ఆందోళనలకు దూరంగా ఉండాలి..

రైతులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ఆందోళనలకు దూరంగా ఉండాలని సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj) విజ్ఞప్తి చేశారు. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోదని, రాబోయే రోజుల్లో ప్రకృతి అనుకూలించి తగినంత నీటి లభ్యత ఏర్పడితే ఆయకట్టు పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.

భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త రిజర్వాయర్లు, చిన్న నీటి నిల్వల ఏర్పాటుతో పాటు నీటి వనరులను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షులు బెక్కరి మధుసూదన్ రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవేజ్, మొహిజ్, చందు యాదవ్, కె.సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read : రూ.46 కోట్ల మోసం.. పోలీసులను ఆశ్రయించిన నటి రాధ

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>