కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్‌లో (Asian Games 2026) భారత పురుషుల బ్యాడ్మింటన్ జట్టు సత్తా చాటింది. బంగ్లాదేశ్‌పై 3-0తో ఘన విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్‌కు (Badminton Quarterfinals) దూసుకెళ్లింది. వరుసగా మూడు సింగిల్స్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్.. డబుల్స్ మ్యాచ్ అవసరం లేకుండానే పోరును ముగించింది. తొలి మ్యాచ్‌లో లక్ష్య సేన్ 21-4, 21-12తో అయ్మాన్ ఇబ్న్ జమాన్‌పై విజయం సాధించి భారత్‌కు శుభారంభం అందించాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో మ్యాచ్‌లో ఆయుష్ శెట్టి 21-4, 21-13తో గౌరబ్ సింఘాను ఓడించి ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
భారత్ విజయాన్ని ఖరారు చేసేందుకు బరిలోకి దిగిన అనుభవజ్ఞుడు కిదాంబి శ్రీకాంత్.. అల్ అమీన్ జుమర్‌పై 21-15, 21-9తో వరుస గేముల్లో గెలిచాడు. దీంతో భారత్ 3-0తో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. మూడు సింగిల్స్‌లోనే విజయం ఖరారు కావడంతో డబుల్స్ మ్యాచ్‌లు అవసరం లేకుండానే భారత్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. తదుపరి రౌండ్లో భారత్ జపాన్‌తో తలపడే అవకాశం ఉంది.

