నీళ్ల కోసం అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోలు

​కలం, జోగులాంబ గద్వాల: జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) నుంచి సాగు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. దాదాపు నాలుగు గంటల పాటు రహదారిపైనే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో దాదాపు 10 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్నగద్వాల అదనపు కలెక్టర్ ముందు మహిళా రైతులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. చేతికి వచ్చిన పంటలు నీరు లేక కళ్ల ముందే ఎండిపోతున్నాయని కన్నీరుమున్నీరయ్యారు.

పెట్టుబడులు బూడిదపాలు కాకుండా చూడాలని, జూరాల (Jurala Project) నీటిని తక్షణమే విడుదల చేయాలని అదనపు కలెక్టర్ కాళ్లపై పడి మహిళా రైతులు దీనంగా వేడుకోవడం అక్కడి వారిని చలింపజేసింది. స్పందించిన అదనపు కలెక్టర్.. సంబంధిత నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీతో రైతులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించారు.

Also Read : ప్రజావాణికి యూట్యూబర్ నందన బాధితులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>