వలిగొండలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై యాదాద్రి ఎస్పీ కీలక ఆదేశాలు

కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ (SP Akshansh Yadav) సోమవారం వలిగొండ (Valigonda) మండలంలోని సంగెం కత్వ వద్ద గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిమజ్జన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు, విద్యుత్‌ సరఫరా, లైటింగ్, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, క్రేన్ల ఏర్పాటు, రక్షణ చర్యలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. భక్తుల భద్రతే పోలీసుల ప్రధాన ప్రాధాన్యత​ అని ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, వలిగొండ ఎస్‌హెచ్‌ఓ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Also Read : జపాన్‌లో తుఫాను కలకలం.. భారత్ ప్రాక్టీస్‌కు బ్రేక్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>