కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి త్వరలో సిరిసిల్లకు రాబోతుండటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) స్పందించారు. సిరిసిల్లలో తాను 8 వేల ఎకరాలు కబ్జా చేశానంటూ అసెంబ్లీలో చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. చేసిన తప్పులకు రాజన్నను దర్శించుకుని పాప ప్రాప్తి చేసుకోవాలని సూచించారు. సిరిసిల్ల పర్యటనకు వచ్చి జనాలకు ఏం చెబుతారని ఎద్దేవా చేశారు. మూడు సార్లు రైతు బంధు ఎగ్గొట్టడం, ఆటో డ్రైవర్లకు ఏడాది రూ.12 వేలు ఇస్తానని మోసం చేయడం, చేనేతలు మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవడానికి తానే కారణమని రేవంత్ చెబుతారా.. అని ప్రశ్నించారు.
జడ్జితో విచారణ చేయిస్తావా..?
సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన ఆస్తులు, మా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది తప్ప.. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి తనిఖీలు చేయడమేంటన్నారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేతలపై ఎంత కసి ఉంటే అంత తీర్చుకోవాలని.. కానీ, రైతులకు కరెంట్, నీరు ఇవ్వాలని సూచించారు.
Also Read : ఆసియన్ గేమ్స్‌లో సూచిక చారిత్రక రికార్డు!
Follow Us On : WhatsApp

