బీఆర్‌ఎస్ పాపాల చిట్టా బయట పెడతాం : మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అవినీతి చిట్కాలు బయటపెడతామని (Minister Adluri Laxman Kumar) మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. కేసీఆర్ తో పాటు హరీష్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ లను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ప్రజలతో కలిసి సహ పంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో జరిగిన అవినీతిని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టారని గుర్తు చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ ముందు దళితులు ధర్నా చేస్తే పసుపు నీళ్లతో శుద్ధిచేసిన సంఘటనపై నేటి వరకు కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆయన (Minister Adluri) ప్రశ్నించారు.

ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో ఉన్న అసైన్డ్ భూముల బాగోతాన్ని బయటపెట్టి పేద దళితులకు పంపిణీ చేస్తామన్నారు. పదేళ్లు అవినీతికి పాల్పడిన బీఆర్ఎస్ నాయకులు ప్రజాప్రభుత్వం పై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ధర్మారం మండల పార్టీ అధ్యక్షుడు రూప్ల నాయక్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ నాయకులు తిరుపతిరెడ్డి, అంజన్న, ఉదయ్, ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>