కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు, కండక్టర్ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని సీఐటీయూ (CITU) జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్(Bommena Suresh) తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవనంలో ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు, కండక్టర్ల యూనియన్ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు సీఐటీయూలో చేరారు.
ఈ సందర్భంగా బొమ్మెన సురేష్ మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలల బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు జీవో నెం.6 ప్రకారం వేతనాలు చెల్లించాలని, చేస్తున్న పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు కల్పించాలని పాఠశాలల యాజమాన్యాలను కోరారు. అనంతరం ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్లు, కండక్టర్ల యూనియన్ నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా బొమ్మెన సురేష్, అధ్యక్షుడిగా ఎంఏ రహీం, ప్రధాన కార్యదర్శిగా వెంకటేష్, కోశాధికారిగా ఖలీల్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా మోహన్, జలీల్, రైజ్, రమేష్, రాజేందర్, ప్రభాకర్, సహాయ కార్యదర్శులుగా ఎస్కే అడ్నిన్, సుభాష్ సింగ్, కే. భూమయ్య, సుధాకర్, ఫెరోజ్ జాంగిర్ఖాన్ ఎన్నికయ్యారు.

