ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కులం వేధింపులే కారణమా?

కలం, వెబ్ డెస్క్: ఐఐటీ బాంబే (IIT Bombay)లో విద్యార్థి సాహిల్ రవీంద్ర వాకోడే (20) ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాట్ జీపీటీ ఉపయోగించి పరీక్ష రాస్తుండటంతో ప్రొఫెసర్ మందలించగా.. మనస్తాపంతోనే సాహిల్ సూసైడ్ చేసుకున్నారని అందరూ భావించారు. అయితే మృతుడి తండ్రి మాత్రం ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్ల కులం పేరుతో వేధించడంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. అతడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రొఫెసర్ సూర్యనారాయణను డీన్ పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది.

ముంబై క్రైం బ్రాంచ్ దర్యాప్తు..

కేసు తీవ్రత నేపథ్యంలో సాహిల్ (Sahil) ఆత్మహత్య వెనుక అసలైన కారణాలను శోధించేందుకు ముంబై క్రైం బ్రాంచ్ విభాగానికి బదిలీ చేశారు. అయితే ప్రొఫెసర్ సూర్యనారాయణ కులం వేధింపులు పాల్పడ్డారనే ఆరోపణలను ఐఐటీ (IIT Bombay) డైరెక్టర్ ఖండించారు. సాహిల్ అలాంటిదేం చెప్పలేదని.. పరీక్ష రాసిన తరువాత ఆయనకు కేవలం కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేశామని వివరించారు. అంతేగాకుండా భవిష్యత్తులో కూడా ఎలాంటి చర్యలు తీసుకోమని కూడా సాహిల్‌కు హామీ ఇచ్చినా.. ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత విచారకరమని పేర్కొన్నారు.

Also Read : ట్యాంక్‌ బండ్ వద్ద ఉద్రిక్తత.. నిమజ్జనానికి అనుమతివ్వాలంటూ నిరసన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>