కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆందోళనకు దిగారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనాని (Ganesh Immersion Row) కి అనుమతి ఇవ్వాలంటూ బారికేడ్లు తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పలువురు పోలీసులు కిందపడిపోయారు. దీంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావారణం నెలకొంది. నిమజ్జనానికి అనుమతి ఇవ్వాల్సిందేనంటూ బారీకేడ్లను తొలగించారు. నిరసనకారులను అడ్డుకునేందుకు, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు భారీగా పోలీసులను మోహరించారు.
కాగా, తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయనివ్వకుండా పోలీసులు ఇనుప భారీకేడ్లు ఏర్పాటు చేశారు. అయితే, హిందువుల పండుగకే ఆంక్షలు గుర్తుకు వస్తాయా..? అని భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిమజ్జనానికి అనుమతివ్వాలంటూ ట్యాంక్ బండ్ వద్ద నిరసనకు దిగాయి.
Also Read : ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కులం వేధింపులే కారణమా?
Follow Us On: X(Twitter)

