పిఠాపురంలో న‌గ‌ర‌వ‌నం ప్రారంభం!

క‌లం, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) నేడు ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పిఠాపురం (Pithapuram)లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా కోట్లాది రూపాయల విలువైన అభివృద్ధి ప‌నుల‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా పిఠాపురంలో ప‌చ్చ‌ద‌నాన్ని పెంపొందిస్తూ న‌గ‌ర‌, ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు ఆహ్వాదాన్ని క‌లిగించేందుకు ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో అభివృద్ధి చేసిన పీఠికాపురవనం నగరవనాన్ని పవన్ ప్రారంభించారు. నగరవనంలో మొక్కను నాటి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ నగర వన్ యోజన పథకం కింద సుమారు రూ.1.83 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో దీనిని అభివృద్ధి చేసింది.

పిఠాపురానికి ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని నగరవనంలో ఆహ్లాదం, ఆధ్యాత్మికత ఉట్టిప‌డేలా తీర్చిదిద్దారు. అందులో ముఖ్యంగా నక్షత్రవనం, శివపంచాయతన వనం ప్రత్యేక ఆకర్షణగా మారాయి. 27 నక్షత్రాలకు ప్రతీకగా నిలిచే ఉసిరి, మేడి, మోదుగ, కొండమామిడి, పిప్పలి, వెదురు, రావి, మర్రి, జాతి జువ్వి, దేవదారు, పసన, జిల్లేడు, జమ్మి, విప్ప, వేప తదితర రకాల మొక్కలను ఒక వరుస క్రమంలో నాటారు. అట‌వీ అధికారులు వీటి ప్ర‌త్యేక‌త‌ల‌ను డిప్యూటీ సీఎంకు వివ‌రించారు. అలాగే ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం, వాడుకలో ఉన్న పేరుతో బోర్డులు ఏర్పాటు చేశారు. ఇక్క‌డే ఏర్పాటు చేసిన‌ బటర్‌ఫ్లై పార్క్‌, నగరవనం మధ్య భారీ కొలను అంద‌రినీ ఆక‌ట్టుకుంటున్నాయి. అలాగే ప‌వ‌న్ క‌ల్యాణ్ నేడు మైసమ్మ చెరువును సందర్శించి అక్క‌డ ఏర్పాటు చేసిన వాకింగ్ ట్రాక్, ఓపెన్ ఎయిర్ జిమ్‌తోపాటు పిల్లల పార్కును ప్రారంభించారు. నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి చేసిన మరో 11 చెరువులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కాకినాడ జిల్లా పరిధిలో అభివృద్ధి చేసిన 14 చెరువులకు సంబంధించిన గ్యాలరీని సందర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>