ఇటుకల వ్యాపారంతో రూ. 16 లక్షల సంపాదన.. చంద్రబాబు ప్రశంసలు

కలం, వెబ్ డెస్క్: చేయూత ఇవ్వాలే కానీ.. మధ్య తరగతి మహిళలు సైతం అన్ని రంగాల్లో రాణించగలరు. పురుషులకు కష్టమైన పనుల్లో పనిచేయగలుగుతారు. ఈ నేపథ్యంలో ఏపికి చెందిన ఓ మహిళ (AP Woman) ఇటుకల వ్యాపారంలోకి అడుగుపెట్టి ఏడాదికి రూ.16 లక్షలకుపైగా సంపాదిస్తోంది. ‘బంగారు కుటుంబం’ కార్యక్రమం ద్వారా అందిన సాయంతో ఇటుకల తయారీ వ్యాపారం ప్రారంభించింది.

మూడు నెలల్లో రూ.4 లక్షల ఆదాయం వస్తోందని తెలిపారు. తాను మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నానని, ఖర్చులు పోను ఏడాదికి రూ.10 లక్షలు మిగులుతాయని చెప్పారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబును మహిళను అభినందించారు. “నువ్వో పారిశ్రామికవేత్తవు” అంటూ ప్రశంసించారు. ఇలాగే ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారు కావాలని కుప్పం పర్యటనలో ఆకాంక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. ఈ మహిళ విజయం ఎంతోమంది ఆడవాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>