అఫ్ఘనిస్తాన్‌పై పాక్ ఎయిర్ స్ట్రైక్..!

కలం, వెబ్ డెస్క్ : అఫ్ఘనిస్తాన్‌పై దాయాది దేశం పాకిస్థాన్ వైమానిక దాడులకు (Pakistan Airstrike) పాల్పడింది. ఉగ్రవాదుల స్థావరాలుగా అనుమానిస్తున్న వాటిపై పాక్ సోమవారం జరిపిన దాడుల్లో 28 మంది ఉగ్రవాదులు మరణించాలరని పాక్ భద్రతాధికారులు ప్రకటించారు. అయితే, ముగ్గురు పౌరులు మరణించడంతో పాటు నలుగురు గాయపడ్డారని అఫ్ఘన్ అధికారులు వెల్లడించారు. కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, కునార్, పక్తికా ప్రావిన్సులలో పాక్ ఎయిర్ స్ట్రైక్ చేయడం ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలున్నాయి.

దాడులను ఖండించిన అఫ్ఘన్

పాకిస్థాన్ వైమానిక దాడులను ఆఫ్ఘన్ తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఖండించారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ఈ చర్యపై ఆఫ్ఘనిస్తాన్ ప్రతిస్పందిస్తుందని పేర్కొన్నారు. కునార్ ప్రావిన్సులోని నూర్గల్ జిల్లాలో, పక్తికాలోని బర్మల్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ దాడులు ప్రారంభమయ్యాయి. నూర్గల్‌లోని పఠాన్ గ్రామంలో ఇద్దరు మరణించగా ఒకరికి గాయాలైనట్లు అఫ్ఘన్ అధికారులు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>