కలం, మహబూబ్ నగర్: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి సమస్యలను తెలుసుకునేందుకు రేపు అనగా మంగళవారం జూరాల ప్రాజెక్టుకు వెళ్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు (BJP Chief) రామచందర్ రావు (Ramchander Rao) వెల్లడించారు. ఎల్ నినో పరిస్థితిపై ముందే సమాచారం ఉన్నా ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. జూరాల నుంచి వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకూ ఆసరాగా నిలిచేలా రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

