గణేశ్ మండపంలో చెలరేగిన మంటలు: కార్లు, బైక్‌లు దగ్ధం!

కలం, వెబ్​ డెస్క్ : హైదరాబాద్ ఉప్పల్‌ (Uppal Fire) లోని ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జూపిటర్ అపార్ట్‌మెంట్‌లో ఆవరణలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ మంటలు తీవ్రరూపం దాల్చి సమీపంలో పార్క్ చేసి ఉంచిన వాహనాలకు వేగంగా వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్లతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ ప్రమాదంలో ఆవరణలో ఉన్న రెండు కార్లు, రెండు బైక్‌లు, ఒక సైకిల్ పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఫైర్ సిబ్బంది సమయానికి స్పందించి మంటలను అదుపు చేయడంతో అపార్ట్‌మెంట్‌లోని ఇతర ప్రాంతాలకు మంటలు సోకకుండా పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు అంటున్నారు. అయితే, మండపంలో వెలిగించిన దీపం వల్ల గానీ లేదా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గానీ ఈ ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>