కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో మలక్ పేట్‌లో ఓ కానిస్టేబుల్ ఉరి వేసుకొని మృతి (Constable Chandrasekhar Suicide) చెందటం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. మూసారాంబాగ్ శాలివాహననగర్‌లో ఈ విషాద ఘటన జరిగింది. అయితే సూసైడ్ చేసుకున్న వ్యక్తి కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35)గా గుర్తించారు. అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో చంద్రశేఖర్ రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గత అర్ధరాత్రి కానిస్టేబుల్ ఈ దారుణానికి పాల్పడ్డారు. అయితే సూసైడ్ కు ముందు చంద్రశేఖర్ ఓ యువతికి వీడియో కాల్ చేసి ఉరి వేసుకుంటున్నట్లు చెప్పాడు.
దీంతో భయాందోళనకు గురైన సదరు యువతి.. చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి పోలీసులు వెంటనే చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చైతన్యపురి పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

