పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్‌లపై ఇటలీ ప్రధాని సంచలన నిర్ణయం

కలం, వెబ్​ డెస్క్ : ఇటలీలోని పాఠశాలల్లో బుర్ఖా, నిఖాబ్‌ల వినియోగంపై నిషేధం (Burqa Ban) విధిస్తూ ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోమ్‌లో జరిగిన తన పార్టీ యువజన విభాగానికి సంబంధించిన సదస్సులో మాట్లాడిన ఆమె, త్వరలోనే ఈ కొత్త నిబంధనలను కేబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు. పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరూ తమ ముఖం కనిపించేలా ఉండాలని, సంప్రదాయాలు లేదా సంస్కృతి పేరిట ఏ యువతి ముఖాన్ని కప్పి ఉంచాలనే భావనను ఇటలీ చట్టాలు అంగీకరించబోవని ఆమె స్పష్టం చేశారు.

ఈ మేరకు స్త్రీ-పురుష సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో తమ ప్రభుత్వం ఎటువంటి రాజీ పడబోదని మెలోనీ తేల్చి చెప్పారు. ఈ నూతన నిబంధనల్లో భాగంగా విదేశీ విద్యార్థుల సమీకరణ, భాషా నైపుణ్యాల పెంపుపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఈ క్రమంలోనే స్థానిక సంస్కృతిని అర్థం చేసుకోనేందుకు వీలుగా విదేశీ విద్యార్థుల తల్లిదండ్రులు ఇటాలియన్ భాష నేర్చుకోవడం తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే ఈ బిల్లును కేబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>