అదుపుతప్పిన బైక్.. లారీ కింద పడి మహిళ దుర్మరణం!

​కలం, ఖమ్మం బ్యూరో : కొత్తగూడెంలో చదువుకుంటున్న పెద్ద కూతురిని చూసి వద్దామని ద్విచక్ర వాహనంపై ఆనందంగా బయలుదేరిన ఆ కుటుంబంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ యమపాశమై విరుచుకుపడటంతో మహిళ అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి (Tekulapalli Accident) మండల పరిధిలోని సాయన్నపేట మూల మలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

​స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన గూగులోతు ఉమ (32), ఆమె భర్త మోహన్ తమ చిన్న కుమార్తె జైత్రతో కలిసి ఆదివారం ద్విచక్ర వాహనంపై కొత్తగూడెంలో ఉంటున్న పెద్ద కుమార్తెను చూడటానికి బయలుదేరారు. ​బాధితులు సాయన్నపేట మూల మలుపు వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ, వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉమ లారీ టైర్ల కింద పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మోహన్‌కు తీవ్ర గాయాలు కాగా, చిన్నారి జైత్ర అదృష్టవశాత్తూ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడింది.

​సమాచారం అందుకున్న టేకులపల్లి ఎస్సై తిరుపతి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తీవ్రంగా గాయపడిన మోహన్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉమ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>