కలం, వెబ్ డెస్క్ : డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కలిగిన వాహనదారులకు రవాణా శాఖ కీలక సూచనలు చేసింది. లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తక్షణమే అనుసంధానం చేసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ రవాణా సేవలు, ఈ-చలాన్లు, వాహన సంబంధిత ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందేందుకు లైసెన్స్‌తో మొబైల్ నంబర్ లింక్ అయి ఉండటం అత్యంత ఆవశ్యకం.
మొబైల్ నంబర్ అప్డేట్ చేయడానికి రవాణా శాఖ అధికారులు సెప్టెంబర్ 25ను తుది గడువుగా నిర్ణయించారు. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే, ఇంటి నుంచే ఉచితంగా ఆన్లైన్ ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేసే వెసులుబాటు కల్పించారు.
సారథి పరివాహన్ (Sarathi Parivahan) అధికారిక పోర్టల్‌లోకి వెళ్లి, తమ రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత ‘మొబైల్ నంబర్ అప్డేట్’ ఆప్షన్ ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చు. లైసెన్స్ వివరాలు నమోదు చేసి, కొత్త మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP)ని సబ్మిట్ చేయడం ద్వారా అప్డేట్ ప్రక్రియ పూర్తవుతుంది. నిర్ణీత గడువులోగా మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోకపోతే లైసెన్స్ సేవలు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

