కలం, వెబ్ డెస్క్ : కొత్త ఏడాది వచ్చేసింది. నేటి నుంచి కొత్త రూల్స్ (New Rules) అమల్లోకి రాబోతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్నింటి గడువు కూడా ముగిసిపోయింది. అలా ఇప్పటి నుంచి ఏమేం మారుతాయి అనేది ఒకసారి లుక్కేద్దాం. నిన్నటితో ఐన్ కమ్ రిటర్న్స్ రెన్యువల్ గడువు ముగిసిపోయింది. కాబట్టి దీని కోసం ఇక ఎవరూ అప్లై చేయలేరు. అలాగే ఐటీఆర్-యూ గడువు కూడా ముగిసింది. దీంతో పాటు ఆధార్-పాన్ కార్డు లింక్ చేసుకునే గడువు కూడా నిన్నటితో అయిపోయింది. లింక్ చేసుకోని వారు ఇక నుంచి ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించలేరు. పాన్ కార్డును ఇనాక్టివ్ చేసే ఛాన్స్ కూడా ఉంది.
సిలిండర్ ధరల్లో మార్పులు..
నేటి నుంచి ఎల్ పీజీ సిలిండర్ ధరల్లో మార్పులు జరగబోతున్నాయి. కొన్ని నెలలుగా ఈ సిలిండర్ ధరల్లో పెద్దగా మార్పులు ఉండట్లేదు. కానీ నేటి నుంచి కొత్త ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటించబోతున్నాయి. ఇంట్లోకి వాడుకునే సిలిండర్ ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. హోటళ్లలో వాడే సిలిండర్ ధరలు మాత్రం కొన్ని నెలలుగా తగ్గుతూ వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు మార్పు ఉంటుందో చూడాలి.
సిబిల్ స్కోర్లలో మార్పులు..
సిబిల్ స్కోర్లలో (Cibil Score) కూడా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి వరకు బ్యాంకులు అన్ని రకాల సిబిల్ స్కోర్లను 15 రోజులకు ఒకసారి అప్డేట్ చేసేవారు. కానీ ఇక నుంచి ప్రతి వారానికి ఒకసారి అప్డేట్ చేస్తారు. దీని వల్ల మీరు చేసే బ్యాంకింగ్ కార్యకలాపాలు, క్రెడిట్ స్కోర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాయి. దాని వల్ల చాలా త్వరగా సిబిల్ స్కోర్ లో మార్పులు కనిపిస్తాయి.
Read Also: మందుబాబులా మజాకా.. 3 రోజుల్లో రూ.వెయ్యి కోట్ల లిక్కర్ తాగేశారు
Follow Us On: Instagram


