కలం, వెబ్ డెస్క్ : నూతన సంవత్సర వేడుకల్లో మందుబాబులు తెగ తాగేశారు. తెలంగాణలో మూడు రోజుల్లోనే మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales) విపరీతంగా పెరిగాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో మొత్తం కలిపి రూ.1000 కోట్లకు పైగా విలువైన మద్యం సేల్ అయ్యాయి. అలాగే, గత ఆరు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు మొత్తం రూ.1,350 కోట్లకు చేరాయి. ఈ కొద్ది కాలంలోనే 8.30 లక్షల లిక్కర్ కేసులు, 7.78 లక్షల బీర్ కేసులు అమ్ముడైనట్లు అధికారులు వివరించారు.
సాధారణంగానే మద్యం అమ్మకాలు ఒకరేంజ్లో జరుగుతుంటాయి. లిక్కర్ సేల్స్ తో ఒక్కరోజునే కోట్ల ఆదాయం ప్రభుత్వానికి అందుతుంటుంది. ఈ క్రమంలోనే న్యూ ఇయర్ (New Year Celebrations) జోష్ లో మందుబాబులు మూడు రోజుల్లోనే తెగతాగేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 29న రూ.280 కోట్లు, డిసెంబర్ 30న రూ. 380 కోట్లు, డిసెంబర్ 31 రోజున రూ. 315 కోట్లకు పైగా విలువైన మద్యం అమ్మకాలు (Telangana Liquor Sales) జరిగాయి. 2024 డిసెంబర్ నెలాఖర్లో రూ. 736 కోట్ల విక్రయాలు జరగ్గా ఈ సారి ఆ రికార్డు బద్దలైంది.
Read Also: అణు కేంద్రాల రక్షణ.. భారత్-పాక్ కీలక ఒప్పందం
Follow Us On: X(Twitter)


