కలం, వెబ్‌డెస్క్: భారత వాయుసేన ట్రైనింగ్ కమాండ్‌కు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్(ఏవోసీ–ఇన్–సి)గా ఎయిర్ మార్షల్ సీతేపల్లి శ్రీనివాస్ (Seethepalli Shrinivas) నియమితులయ్యారు. ఈ మేరకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. అనంతరం ఇదే రోజు పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ బెంగళూరులోని ట్రైనింగ్ కమాండ్ వార్ మెమోరియల్‌లో అమరవీరుల స్తూపానికి నివాళి అర్పించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఎయిర్ మార్షన్ శ్రీనివాస్ 1987 జూన్‌లో ఐఏఎఫ్ ఫైటర్ స్ట్రీమ్‌లో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. యుద్ధ విమానాలు నడపడంలో శ్రీనివాస్ విశేష అనుభవం ఉంది.
వాయుసేనలో మిగ్–21, ఇస్క్రా, కిరణ్, పీసీ–7 ఎంకే2, హెచ్‌పీటీ–32, మైక్రోలైట్ ఎయిర్‌క్రాఫ్ట్ తదితర వాటిలో ఆయనకు 4,200 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉంది. అలాగే యుద్ధ విమానాలు నడపడానికి శిక్షణ ఇవ్వడంలో ఎ–కేటగిరీ ట్రైనర్‌గా శ్రీనివాస్ (Seethepalli Shrinivas)కు గుర్తింపు ఉంది. 2017 విశిష్ట సేవ, 2024లో ఏటీఐ విశిష్ట సేవ పురస్కారాలను ఆయన పొందారు. ఎయిర్ మార్షల్ సీతేపల్లి శ్రీనివాస్ తెలంగాణకు చెందిన వ్యక్తిగా భావిస్తారు. తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఒకసారి పద్మ అవార్డుకు సిఫార్సు చేసింది.
Read Also: తొలి వందే భారత్ స్లీపర్ ఏ రూట్లో అంటే..
Follow Us On: Instagram


