పాలమూరు జర్నలిస్టుల సంఘం కీలక తీర్మానం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జర్నలిస్టుల కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలో పాలమూరు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఏర్పాటయింది. ఈ నేపథ్యంలో ఇక మీదట సభ్యత్వం ఉచితమేనని కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వాకిట అశోక్ కుమార్, మల్లు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కమిటీ సభ్యులతో తీర్మానం చేశారు. సంఘం ఏర్పాటు సమయంలో సభ్యత్వ రుసుము రూ.1000 నిర్ణయించామన్నారు. అయితే జర్నలిస్టుల నుంచి వస్తున్న వినతుల దృష్ట్యా విప్ సూచన మేరకు సభ్యత్వ రుసుము తీసేస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటికే వెయ్యి రూపాయలు చెల్లించినవారికి వాపసు చేయనున్నట్లు అశోక్ కుమార్ తెలిపారు. వచ్చే సోమవారం నుంచి పది రోజులపాటు సురవరం ప్రతాపరెడ్డి ప్రెస్ భవన్ (మహబూబ్ నగర్ ప్రెస్ క్లబ్)లో సభ్యత్వాలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. ఇటీవల అనారోగ్యానికి గురైన జర్నలిస్టులు ఆరగిద్ద అనిల్ సతీమణి, ప్రదీప్‌కు ఆర్థిక సాయం చేయాలని కమిటీ తీర్మానం చేసింది. సభ్యత్వం చేసుకోలేని వారికి ఆర్థిక సాయం అందబోదని స్పష్టం చేశారు. సభ్యులు యాదగిరి, పల్లెమోని యాదయ్య, రమాకాంత్ రెడ్డి, సంతోష్ కుమార్, సతీష్, సతీష్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>