కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ (Devarakota Temple) హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ రంగు రవికిషన్ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అన్ని హుండీలు కలుపుకొని రూ. 4,19,719 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భూమయ్య తెలిపారు. హుండీ లెక్కింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, ధర్మకర్తలు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

