కలం, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. అసలు తాను కాంగ్రెస్ పార్టీని వీడటానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి అన్నారు. 2018లో రాహుల్ గాంధీ మహిళను సీఎం చేస్తానని ప్రకటించడంతో రేవంత్ రెడ్డి తనను, డీకే అరుణను పార్టీలో నుంచి గెంటేశాడని ఆరోపించారు. ఇటీవల సీఎం రేవంత్ సబితా ఇంద్రారెడ్డి కొడుకు గురించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె ఈ విధంగా స్పందించారు. రాజకీయంగా తన కొడుకుకు టికెట్ ఇప్పిచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
2006లో రేవంత్ రెడ్డి (Revanth Reddy) జడ్పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చారన్నాని, కానీ తాను మాత్రం 2000 సంవత్సరంలోనే కాంగ్రెస్ పార్టీకి సేవ చేశానని గుర్తు చేశారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు, ప్రజలకు అందరికీ తెలుసునన్నారు. సీఎం రేవంత్ ఇప్పుడు వచ్చి తమకు కితాబివ్వాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పుడు తాను పార్టీ మారానని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ వీడితేనే భట్టికి అన్యాయం జరిగిందన్నట్లు మాట్లాడుతున్నారని సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. భట్టి మీద సీఎం రేవంత్‌కు అంత ప్రేమ ఉంటే సీఎం పదవి ఇవ్వాలని సవాల్ చేశారు. దళిత సోదరులకు ఇస్తానన్న ఎస్సీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌లకు హరీష్ రావు బిగ్ షాక్!
Follow Us On : WhatsApp

