ప్రజా పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట: మేడిపల్లి సత్యం

కలం, ​కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం (ప్రజా పాలన దినోత్సవం) వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు మేడిపల్లి సత్యం (MLA Medipalli Satyam) జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి మిఠాయిలు పంచుకుని, బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌‌భాయ్ పటేల్ నేతృత్వంలో తెలంగాణ ప్రాంతం అఖండ భారతంలో విలీనమైందని గుర్తుచేశారు.

ఆనాటి సాయుధ పోరాటాల నుంచి మొదలై, 60 ఏళ్ల ప్రజల ఆకాంక్షను గుర్తించిన UPA అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ‘ప్రజా పాలన దినోత్సవం’గా నిర్వహిస్తూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు. ప్రజా పాలనలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయని పేర్కొంటూ తెలంగాణ ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ SUDA చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, నాయకులు ఉప్పుల అంజనీ ప్రసాద్, ఎండి తాజ్, మడుపు మోహన్, కాంతాల జగన్ రెడ్డి, పత్తి మధుకర్, కుంభాల రాజకుమార్ తదితర ముఖ్య నాయకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>