మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌లకు హరీష్ రావు బిగ్ షాక్!

కలం, వెబ్ డెస్క్ : టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌లపై నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) తరఫు న్యాయవాది పరువు నష్టం దావా వేశారు. తనపై క్షుద్ర పూజల ఆరోపణలు చేస్తూ వ్యక్తిగత, రాజకీయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేశారని హరీష్ రావు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

ఇంతకుముందే ఆ ఆరోపణలను ఉపసంహరించుకుని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు లీగల్ నోటీసులు పంపారు. ఇచ్చిన సమయం పూర్తయినప్పటికీ వారు స్పందించకపోవడం, క్షమాపణలు చెప్పకపోవడంతో హరీష్ రావు తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>