కలం వెబ్ డెస్క్ : న్యూ ఇయర్(New Year) వేడుకల్లో మందుకు ఎంత డిమాండ్ ఉందో చికెన్(Chicken)కూ అంతే డిమాండ్ ఉంది. ఈ రెండూ మార్కెట్లో పోటాపోటీగా అమ్ముడయ్యాయి. ఎక్కడ చూసినా చికెన్ సెంటర్ల ముందు జనం క్యూ కట్టారు. ఈ క్రమంలో కర్నూలు(Kurnool) జిల్లాలోని ఓ చికెన్ సెంటర్ వద్ద దారుణం చోటు చేసుకుంది. కొందరు వినియోగదారులు చికెన్ తమకు ముందు కావాలంటే తమకు ముందు కావాలని ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో ఓ యువకుడు ముగ్గురిపై కత్తి(Knife)తో దాడి చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. న్యూ ఇయర్ సందర్భంగా మంత్రాలయం మండలంలోని బూదూరులో చికెన్ కోసం చాలామంది కస్టమర్లు వచ్చారు. మాకు ముందు కావాలంటే మాకు ముందు కావాలని చికెన్ షాపు వద్ద గొడవ పడ్డారు ఈ క్రమంలో నరేష్ అనే యువకుడు ముగ్గురిపై చికెన్ కట్ చేసే కత్తితో దాడి చేశాడు. దాడిలో విజయ్, చిన్న, గాబ్రేలు అనే వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో విజయ్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే వారిని ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు నరేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


