కలం వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం వచ్చాక నారా లోకేష్(Nara Lokesh) గ్రాఫ్ అమాంతం పెరిగింది. విద్యా శాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ అద్భుతంగా పని చేస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ న్యూ ఇయర్(New Year) సందర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్(viral) అవుతోంది. 2025 సంవత్సరం తనకి ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని లోకేష్ ట్వీట్ చేశారు. ఎంతో సంతృప్తినిచ్చిన గత ఏడాది జ్ఞాపకాలు అని #APGrowthStory2025 క్యాప్షన్‌తో లోకేష్ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ప్రధాని మోడీ నుంచి ప్రశంసలు అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు, మెగా డీఎస్సీ పూర్తి చేయడం వంటి పలు విద్యా శాఖ సంస్కరణల పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ‘మన మిత్ర’ద్వారా వాట్సాప్ సేవలు తీసుకురావడం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో భేటీ వంటి జ్ఞాపకాలు తనకి ఎంతో ఆనందాన్ని కలిగించాయని తెలిపారు. 2047 వికసిత భారత్ ప్రాముఖ్యత, పలు శంకుస్థాపనలకు సంబంధించిన మెమొరీస్‌ని అభిమానులతో వీడియో రూపంలో షేర్ చేసుకున్నారు.


