విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి.. నిర్మల్‌లో బీజేపీ నేతల వినతి

కలం, నిర్మల్: సెప్టెంబర్‌ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బుధవారం నిర్మల్‌ (Nirmal) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో రాథోడ్ రమేష్‌కు బీజేపీ నేతలు (BJP Leaders) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడిసెమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, నాయకులు విజయ్, అనిల్, ధర్మాజీగారి ఈశ్వర్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Also Read : మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>