కలం, నిర్మల్: సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బుధవారం నిర్మల్ (Nirmal) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో రాథోడ్ రమేష్‌కు బీజేపీ నేతలు (BJP Leaders) వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడిసెమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, నాయకులు విజయ్, అనిల్, ధర్మాజీగారి ఈశ్వర్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

