భారత్‌తో వివాదాలపై చైనా కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: భారత్‌తో నెలకొన్న వివాదాలు పరిష్కారమయ్యే దిశగా కీలక ముందడుగు పడినట్లు చైనా ప్రకటించింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, అధ్యక్షుడు జిన్ పింగ్ (Modi – Xi Jinping) మధ్య “అత్యంత ముఖ్యమైన ఏకాభిప్రాయం” కుదిరందని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ వెల్లడించారు. భారత్, చైనా మధ్య మిత్ర బంధం రాబోయే రోజుల్లో మరింత బలపడేందుకు ఈ చర్చలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం కొత్త పుంతలు తొక్కాలని, తద్వారా ఇరు దేశాల్లోని ప్రజలు లాభపడుతారని స్పష్టం చేశారు. అయితే, మోదీ–జిన్ పింగ్ మధ్య ఏ అంశాలపై స్పష్టమైన చర్చలు జరిగాయో మాత్రం వాంగ్ యీ వెల్లడించలేదు.

సరిహద్దు వివాదమే అతి పెద్ద సమస్య..

చైనాతో భారత్‌కు దశాబ్దాలుగా నెలకొన్న సరిహద్దు సమస్యలే ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణలతో తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరుస చర్చల తరువాత ఎట్టకేలకు జిన్ పింగ్ భారత్ పర్యటనకు వచ్చారు. ఈ సమావేశంలో సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా నిరంతర చర్యలతో పాటు వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని మోదీ–జిన్ పింగ్ (Modi – Xi Jinping) అభిప్రాయపడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Also Read : ఏపీ నిరుద్యోగులకు బిగ్ అలర్ట్: ప్రభుత్వం కీలక నిర్ణయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>