తెలంగాణలో నేడు భారీ వర్షాలు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ మేరకు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే, సెప్టెంబర్ 18, 19వ తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తడిసి ముద్దయిన హైదరాబాద్..

సోమవారం ఉదయం నుంచి విరామం లేకుండా పడుతున్న వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బేగంపేట్, తిరుమలగిరి, బోయినపల్లి ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>