ఇంద్రవెల్లి గ్రామాల అభివృద్ధిపై బొజ్జు పటేల్ సమీక్ష

కలం, ఇంద్రవెల్లి: ఇంద్రవెల్లి (Indravelli) మండలంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధిపై ఖానాపూర్ ఎమ్మెల్యే (Khanapur MLA) వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం మండల సర్పంచులు, ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని ఎమ్మెల్యే సూచించారు.

గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని సర్పంచులు, నాయకులను కోరారు. ప్రజాప్రతినిధులు, నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. ఎస్ఐఆర్‌పై ప్రతి గ్రామంలో ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని బొజ్జు పటేల్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>