కలం, వెబ్ డెస్క్: యూపీఐ చెల్లింపుదారుల (UPI Payments)కు కేంద్ర ప్రభుత్వం మరోసారి కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల వరకు చేసే చెల్లింపులకు సామాన్య ప్రజల నుంచి ఎలాంటి ఛార్జీలు విధించవద్దని బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జీరో ఛార్జ్ విధానం పాటించాలని సూచించింది. ఇదే విధానం రూపే డెబిట్ కార్డుకు కూడా వర్తిస్తుంది. నిర్దిష్ట యూపీఐ చెల్లింపులపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి ఛార్జీలు విధించడానికి వీల్లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్క్యులర్ పంపించింది.
సామాన్యలపై భారం ఉండదు..
ఆర్థిక శాఖ తాజా ప్రకటన మాత్రం రూ.2 వేల పరిమితికి మించి చేసే చెల్లింపులపై విధించే ఛార్జీలు సాధారణ కస్టమర్ నుంచి వసూళ్లు చేయరాదు. సాధారణంగా నిర్దేశించిన మార్కెట్ టర్నోవర్ కలిగిన వ్యాపారి డిజిటల్ చెల్లింపులు స్వీకరించినప్పుడు బ్యాంకులు లేదా సర్వీస్ ప్రొవైడర్లు సదరు వ్యాపారికి కనీస ఛార్జీలు విధిస్తుంటాయి. అయితే, ఇది నేరుగా సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపదు. దీనిపై ఆగస్టులోనూ కేంద్రం స్పష్టత ఇచ్చింది.

